జాన్సన్ నాయక్ కేటీఆర్ దోస్తు.. నా తమ్ముడు: హరీశ్ రావు

 కేసీఆర్ అంటే  నమ్మకం..కాంగ్రెస్ అటే మోసమని అన్నారు  మంత్రి హరీశ్ రావు.  కాంగ్రెస్ 11 సార్లు గెలిచి చేసిందేమి లేదని విమర్శించారు. ఖానాపూర్ లో ఎన్నిక ప్రచారం చేసిన హరీశ్..   తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం  వచ్చాక మిషన్ భగీరథ, వైద్యం, విద్య కరెంట్ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటలే కరెంట్ ఇస్తదని.. బీజేపీ గెలిస్తే బావిదగ్గర మీటర్లు పెడుతుందని ఆరోపించారు. 3 గంటల కరెంట్  ఇచ్చే వాళ్లు కావాలా? లేక  24 గంటల కరెంట్ ఇచ్చేవాళ్లు కావాలో తేల్చుకోవాలన్నారు. 

ఖానాపూర్ అబివృద్ది జరగాలంటే  జాన్సన్ నాయక్ ను  భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు మంత్రి హరీశ్ రావు. జాన్సన్ నాయక్ కేటీఆర్ దోస్తు.. తన తమ్ముడని అన్నారు. నిధులు మంజూరు చేసే సత్తా జాన్సన్ నాయక్ కు ఉందన్నారు.  ఉట్నూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జాన్సన్ నాయక్ 100 పడకలు మంజూరు చేయించారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే..  400 లకే సిలిండర్ఇస్తామన్నారు. రైతు బంధు రూ. 16 వేల ఇస్తామన్నారు. కర్ణాటకలో గెలిచిన కాంగ్రెస్ అక్కడి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. 

ALSO READ : టికెట్ల లొల్లి... కాంగ్రెస్లో కొనసాగుతోన్న రాజీనామాలు