ఉమ్మడి నల్గొండ జిల్లాలో12 సీట్లు గెలుస్తాం : మంత్రి హరీశ్​రావు

నల్గొండ/సూర్యాపేట, వెలుగు :  వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం12 సీట్లు గెలుస్తామని మంత్రి హరీశ్​రావు చెప్పారు. శుక్రవారం తుంగతుర్తి, నకిరేకల్​ నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన ఆశ్వీ రాద సభల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​, టీడీపీ పాలనలో తుంగతుర్తి ప్రాంతానికి చుక్కనీరు రాలేదని, కానీ ఇప్పుడు కాలే శ్వరం ప్రాజెక్టుతో ఈ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు పారుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్​ వల్లే నల్గొండ నీళ్ల కుండ అయ్యిందన్నారు.  

మంత్రి జదీశ్​రెడ్డి మాట్లాడుతూ త్వరలో ఎన్నికల నోటిఫికేషన్​ రాబోతుందని, మళ్లీ మాయమాటలతో మోసం చేసేందుకు కాంగ్రెసోళ్లు వస్తున్నారని, వాళ్ల మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. నకిరేకల్, తుంగతుర్తి నియోజకవర్గాలు వేగంగా అభివృ ద్ధి చెందుతున్నాయన్నారు. 

ఎమ్మెల్యేల పనితీరు భేష్​

నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గ్యాదరి కిషోర్​ కుమార్​ పనితీరు బాగుందని మంత్రులు ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్​ఎస్​ పార్టీయేనని స్పష్టం చేశారు. నకిరేకల్​ప్రజలకు చిరుమర్తి నిత్యం అందుబాటులో ఉంటాడని తెలిపారు. 60 ఏళ్లలో చేయని అభివృద్ధిని తొమ్మిదేండ్లలో చేసిన ఘనత ఎమ్మెల్యే కిషోర్ కుమార్​కు దక్కిందన్నారు. ఈ  ఎమ్మెల్యేలను మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ALSO READ: డెంగ్యూ పేరిట దోచేస్తున్నరు..ఉమ్మడి జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు
 

వరాలు.. శంకుస్థాపనలు.. 

ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరిక మేరకు నకిరేకల్​ పట్టణాభివృద్ధికి రూ.50కోట్లు, నార్కట్​పల్లి, రామన్నపేట మండలాలకు కలిపి రూ.26కో ట్లు శాంక్షన్​ చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు.  రామన్నపేట మండలంలో  రూ. 5.70 కోట్లతో 50 పడకల ఆసుపత్రి పనులకు, రూ. 2.50 పడకల ఆసుపత్రి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 101 కోట్లతో నిర్మించనున్న అయిటిపాముల లిఫ్ట్ పనులకు, నకిరేకల్​లో రూ. 5.70 కోట్లతో నిర్మించనున్న డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించారు.  ఎస్టీఓ కార్యాలయ భవనం, లైబ్రరీ బిల్డింగ్ ప్రారంభించా రు.

తుంగతుర్తిలో రూ.45 కోట్లతో రూ.100 పడకల ఆసుపత్రి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. తుంగతుర్తి-అన్నారం రోడ్డుకు రూ.5కోట్లు, రూ.2.8 కోట్లతో తుంగతుర్తిలో హైలెవల్ బ్రిడ్జి, రూ.4కోట్ల తో సెంట్రల్​ లైటింగ్​ సిస్టమ్​ పనులను ప్రారంభించారు. మోత్కూరు కు 30 పడకల ఆసుపత్రి శాంక్షన్​ చేశారు. అర్వపల్లిలో రిటైర్డ్​ చీఫ్​ ఇంజి నీర్​ విద్యాసాగర్​ రావు విగ్రహావిష్కరణతోపాటు, కల్యాణ మండపాన్ని మం త్రులు ఓపెనింగ్​ చేశారు. కాగా మంత్రుల పర్యటన సందర్భంగా అంగన్వాడీ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 


పే స్కేల్​ వర్తింపజేయాలని ఉద్యోగుల వేడుకోలు 

నల్గొండ, వెలుగు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు పే స్కేల్​ వర్తింపజేయాలని నల్గొండ జిల్లా ఉపాధి ఉద్యోగులు కోరారు. ఈ మేరకు శుక్రవారం నకిరే కల్​, రామన్నపేటలో ఉపాధి ఉద్యోగులు మంత్రిని కలిసి వినతి ప త్రం అందజేశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న సె ర్ప్​ ఉద్యోగుల తరహాలోనే తమకు కూడా పే స్కేల్​ వర్తింప చేయాలని, దాదాపు 18 ఏళ్లుగా డిపార్ట్​మెంట్​లో సేవలు అందిస్తున్నామ ని మంత్రికి వివరించారు.