కేసీఆర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన హరీష్ రావు

జగిత్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానిస్తులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ భారీ కటౌట్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ టీఆర్ఎస్ జెండాలను పెట్టారు. మరోవైపు సభా స్థలాన్ని మంత్రి హరీష్ రావు పరిశీలించారు. సభ ఏర్పాట్ల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అడ్డంకి లేకుండా సభ జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. మరోవైపు కేసీఆర్ జగిత్యాల పర్యటనను అడ్డుకుంటామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన పోలీసులు.. పలువురు కాంగ్రెస్ నేతలను హైస్ అరెస్ట్ చేశారు. 

జగిత్యాల పర్యటనలో భాగంగా కేసీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా జిల్లాలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జగిత్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తరువాత జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం భవనాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.