సూర్యపేట జిల్లా డిఎంహెచ్ ఓపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని రామాపురంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు హాజరయ్యారు. అయితే డిఎంహెచ్ఓ మంత్రులను,ఎమ్మెల్యేలను నెట్టేస్తూ లోపలికి వెళ్లాడు. దీంతో డిఎంహెచ్ఓ పై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నువ్వు వెళ్లి బయట నిలబడు అంటూ.. అతనిపై మంత్రి హరీష్ రావు అగ్రహం వ్యక్తం చేశారు.
గరిడేపల్లి, నేరేడ్ చర్లలో మంత్రి జగదీశ్ రెడ్డితో కలసి బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. ఎమ్మెల్యే సైదిరెడ్డి కోరిక మేరకు కొత్తగా ఐటీఐ కాలేజీ శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత మఠంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ మలిదశ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మిర్యాలగూడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలకు మంత్రి హరీశ్ రావు ఎన్నికల వరాలు కురిపించారు.