కార్మిక, బడుగుల అభ్యున్నతికి కాకా కృషి మరువలేనిది: మంత్రి హరీష్రావు

కాకా వెంకటస్వామి 94 జయంతి సందర్భంగా మంత్రి హరీష్ రావు నివాళులర్పించారు. కార్మికులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాకా చేసిన కృషిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

 ‘నిండు మనసుతో తెలంగాణ రావాలని కోరుకున్న వ్యక్తి, కార్మిక, శ్రామిక , బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జి. వెంకటస్వామి (కాకా) జయంతి సందర్భంగా ఘన నివాళి అంటూ ’మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.