
కొమురవెల్లి, వెలుగు: కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని మంత్రి హరీశ్ రావు కొమురవెల్లి మల్లన్నస్వామికి, కొండ గట్టు అంజన్నస్వామికి ముడుపులు కట్టి స్థానిక నాయకులకు అందజేశారు. ఆదివారం హైదరాబాద్ లో మంత్రి క్యాంప్ ఆఫీసులో ముడుపులు కట్టి కొమురవెల్లి మాజీ సర్పంచ్ కిష్టయ్య, ఉపసర్పంచ్ శ్రీధర్, టెంపుల్ మాజీ ధర్మకర్త శ్రీనివాస్ లకు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.