కామారెడ్డి/పిట్లం, వెలుగు : బీఆర్ఎస్ పాలనలోనే జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. బిచ్కుందలో రూ.26 కోట్లతో నిర్మించనున్న 100 బెడ్స్ హాస్పిటల్‌కు మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ బిచ్కుందలో 100 బెడ్స్ హాస్పిటల్ ఏర్పాటుతో నియోజక వర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. నాగమడుగు లిప్టు ఎత్తిపోతల స్కీమ్ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
అభివృద్ధికి కొనసాగింపుగా మళ్లీ మూడో సారి స్టేట్‌లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్యే హన్మంతుషిండే మాట్లాడుతూ 9 ఏండ్ల కాలంలో 100 గ్రామాలకు బీటీ రోడ్లు వేయించామని తెలిపారు.