స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తమకు మార్గదర్శి అని అన్నారు మంత్రి హరీశ్ రావు. బాన్సువాడలోని నస్రూల్లబాద్ మండలం దుర్కిలో నర్సింగ్ కాలేజికి మంత్రి హరీష్ రావు , స్పీకర్ పోచారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడిన హరీశ్ రావు.. పోచారం లక్ష్మీపుత్రుడని.. రాజకీయంగా సుదీర్ఘ అనుభం ఉన్న నేత అని అన్నారు. నియోజకవర్గ అభివృద్దిపై దూరదృష్టి ఉన్న నేత అని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణంలో పోచారం ముందు వరసలో ఉన్నారన్నారు. డబుల్ ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలన్నారు.
అవసరం ఉన్నా లేకున్నా కుటుంబ సభ్యులే సిజేరీయన్ లకు ప్రోత్సహిస్తున్నారని..ఇది మంచి పరిణామం కాదన్నారు. తొందరపడి సిజేరీయన్ లను ప్రోత్సహించొద్దన్నారు. ఆశావర్కర్, వైద్యాధికారులు నార్మల్ డెలివరీ చేసుకునేలా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. బాన్సువాడ ఆసుపత్రిలో కొత్త డాక్టర్లను పెడతామన్నారు. నూతన పోస్టుమార్టం రూమ్ నిర్మాణం చేస్తామన్నారు. అంగన్ వాడి టీచర్లు, ఆశావర్కర్ల, ఏఎన్ యంల పాత్ర కీలకమన్నారు.