కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు: హరీష్​ రావు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆపద మొక్కులు మొక్కుతూ.. జూటా మ్యానిఫెస్టో విడుదల చేసిందని మంత్రి హరీష్​ రావు అన్నారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. కర్ణాటకలో 3 గంటలైనా కరెంట్ రావట్లేదని.. కాంగ్రెస్ పై కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

మూడు, నాలుగు గంటల కరెంట్ తో రైతులకు ఇబ్బందులు పడతారని.. మూడు గంటలతో ఎన్నిపంటలు పండుతాయని నిలదీశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్​ రావు పాల్గొన్నారు. 

కేసీఆర్ అంటనే నమ్మకం, కేసీఆర్ అంటే విశ్వాసమని మంత్రి హరీష్​ రావు అన్నారు. బీఆర్ఎస్ పథకాలన్నీ పేదల కోసమే ప్రవేశపెట్టామని తెలిపారు. సౌభాగ్యలక్ష్మీ స్కీమ్ కింద మూడువేలు అందజేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పించన్లు రూ. 5వేలకు పెంచుతామన్నారు. 

Also Read :-బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత