ఢిల్లీకి ఒక న్యాయం...రాష్ట్రానికి ఒక న్యాయమా ?

రాష్ట్ర బడ్జెట్ లో ఈ సారి 35 కొత్త పథకాలు ప్రవేశపెట్టామన్నారు మంత్రి హరీష్ రావు.డబుల్ బెడ్ రూం పథకం కంటిన్యూ అవుతుందన్నారు.ప్రతి నియోజకవర్గంలో 15వందల మందికి దళిత బంధు ఇస్తామన్నారు.ఈ ఏడాది 45 వేల మందికి అందజేస్తామన్నారు.వచ్చే బడ్జెట్ నాటికి 2 లక్షల మందికి దళిత బంధు ఇచ్చేలా కృషి చేస్తామన్నారు. వెల్ లోకి వస్తే సస్పెండ్ చేస్తామని గత బీఏసీలో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వెల్ లోకి వచ్చారు కాబట్టే బీజేపీ ఎమ్మెల్యే లను సస్పెండ్ చేశామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్ లోకి రాలేదు..కాబట్టే వాళ్లను సస్పెన్షన్ చేయలేదన్నారు. తమ స్థానం లో నిలబడి అడిగితేనే పార్లమెంట్ లో సస్పెన్షన్ చేస్తున్నారు. ఢిల్లీకి ఒక న్యాయం...రాష్ట్రానికి ఒక న్యాయమా అని ప్రశ్నించారు హరీష్ రావు. బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ చేయించు కోవాలని కావాలనే వెల్ లోకి వెళ్లారని ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం,బడ్జెట్ స్పీచ్ సమయం లో వెల్ లోకి రావొద్దని తెలిసినా కూడా వారు పట్టించుకోవడం లేదన్నారు.ఆర్థిక సంఘాలు రిపోర్ట్ ను పక్కకు పెట్టిన ప్రభుత్వం బీజేపీదే అన్నారు హరీష్ రావు. 

మరిన్ని వార్తల కోసం

 

తెలంగాణ బడ్జెట్ లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్