సీఎం కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం: మంత్రి హరీశ్ రావు

సీఎం కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం: మంత్రి హరీశ్ రావు

నర్సాపూర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో  బీజేపీ డకౌట్, కాంగ్రెస్ రనౌట్, సీఎం కేసీఆర్​సెంచరీ పక్కా అని మంత్రి హరీశ్​ రావు అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్​నర్సాపూర్ అభ్యర్థి సునీత రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అంటే ప్రజలకు నమ్మకం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడన్నారు. 11 సార్లు కాంగ్రెస్​కు అవకాశం ఇస్తే ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఒక్క సీటు కూడా రాదని, సెంచరీతో కేసీఆర్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు.

కొడంగల్ లో ఓడిపోతే రేవంత్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేవరకు ఉత్తమ్​కుమార్ రెడ్డి గడ్డం గీసుకోనన్నారు. మాటమీద నిలబడని వారు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.  ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆధ్వర్యంలో సునీత రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ అలీ, రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, అశోక్ గౌడ్ పాల్గొన్నారు.