త్వరలోనే సీఎం కేసీఆర్ కొత్త పథకాలను ప్రకటిస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. యాదాద్రి జిల్లా రామన్న పేటలో పల అభివృద్ధి కార్యక్రమాలనుప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్, బీజేపీ దిమ్మతిరిగేలా బీఆర్ఎస్ మేనిఫేస్టో ఉంటుందన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ శుభవార్త చెబుతారన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే..నేడు సర్కారు దవాఖానకు పోత అంటున్నారని చెప్పారు.
ALSO READ: హైదరాబాద్ కు ఈసీ.. రెండు నెలల్లోనే ఎన్నికలకు చాన్స్
కాంగ్రెస్ కు 30, 40 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరన్నారు. ఇక్కడి నాయకుడు ఒకరు 24 గంటల కరెంట్ రావడం లేదంటున్నాడని.. అందులో వేలు పెట్టి చూస్తే కరెంట్ వస్తుందా లేదా తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారన్నారు. కాంగ్రెస్ నాయులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లేనన్నారు. సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణ యుగమని..ఓట్ల కోసం ఆపద మొక్కులు కాంగ్రెస్ వి అంటూ విరుచుకుపడ్డారు.