కాంగ్రెస్ ఓటు వేస్తే మూడు గంటల కరెంటుకు ఓటేసినట్టే: మంత్రి హరీష్రావు

కాంగ్రెస్ నేతలు ఒక్క ఛాన్స్.. ఒక్కఛాన్స్ అంటున్నారు.. 11 సార్లు అధికారం ఇస్తే ఏమి చేసిన్రు.. రైతు బంధు ఇచ్చిన్రా.. రైతు భీమా ఇచ్చిన్రా.. కరెంట్ ఇచ్చిన్రా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా భువనగిరలో కార్నర్ మీటింగ్ లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర రైతు బంధు కింద 73కోట్ల రూపాయలను రైతులకు ఇస్తున్నారు. 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నాం.. కాంగ్రెస్ వస్తే మోసం చేస్తది.. అన్ని బంద్ చేస్తది అని అన్నారు హరీష్ రావు. కాగ్రెస్ కు ఓటేస్తే మూడు గంటల కరెంట్ కు ఓటేసినట్లే అన్నారు. బీఆర్ ఎస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ను 16వేలకు పెంచుతామని చెప్పారు.