కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం : హరీష్​రావు

కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. ఒక విశ్వాసం అని అన్నారు మంత్రి హరీష్​రావు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని చెప్పారు. తెలంగాణ వచ్చాకే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. నర్సాపూర్​లో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదే అన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డిని ఎంపీగా చేసే బాధ్యత తనదే అన్నారు. కర్ణాటకలో మూడు గంటల కరెంటే ఇస్తున్నామని తామే చెప్పామన్నారు. కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని నిన్న (అక్టోబర్ 28న) డీకే శివకుమార్ నిజాలు చెప్పారని తెలిపారు. 

కర్నాటకలో కాంగ్రెస్ సర్కార్ 5 గంటల పాటు కరెంటు ఇవ్వట్లేదని, 3 గంటలే ఇస్తుందన్నారు మంత్రి హరీష్​రావు. డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టిందన్నారు. ఈ విషయంలో డీకే శివకుమార్ కి థాంక్స్ చెబుతున్నానని చెప్పారు. ఆయనే 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పినప్పుడు.. కరెంటు సరఫరా చూసేందుకు తాము కర్నాటకకు వెళ్లేందుకు బస్సు ఎందుకని ప్రశ్నించారు. కరెంటు విషయంలో డీకేనే నిజాలు చెప్పారని అన్నారు. కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అన్నారు. 

రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంట్ చాలు అంటున్నారని చెప్పారు మంత్రి హరీష్​రావు. డీకే శివకుమార్ మాత్రం ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని అంటున్నారని అన్నారు. రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్లకి సిగ్గు లేదని కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరూ తస్మాత్ జాగ్రత్త...మోసపోతే గోస పడుతామన్నారు. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన కళ్లల్లో మనం పొడుచుకున్నట్టే అన్నారు. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెబుతోందని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లవి తిట్లు...మనవి కిట్లు అన్నారు. కాంగ్రెస్ బూతులు కావాలా...తెలంగాణ భవిష్యత్తు కావాలో ఆలోచించుకోవాలని చెప్పారు. 

అంతకుముందు.. మెదక్ జిల్లా నర్సాపూర్ లో జరిగే బీఆర్ఎస్ జరిగే సభకు వెళ్తున్న మంత్రి హరీష్ రావు వాహనాన్ని మల్లన్న గుడి సమీపంలో పోలీసులు తనిఖీ చేశారు. 

ALSO READ :- క్రేజీ కాంబో: సల్మాన్ ఖాన్‪తో క్రిస్టియానో రోనాల్డో