తెలంగాణ ప్రజలకు కేసీఆరే గ్యారంటీ, వారంటీ : మంత్రి హరీష్ రావు

సిద్దిపేట : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టిందన్నారు మంత్రి హరీష్ రావు. కాపీ కొట్టినా సరిగా కాపీ కొట్టలేదన్నారు. మాటలు చెప్పేవాళ్లు కాంగ్రెస్, బీజేపీ వాళ్లు అయితే.. చేతల్లో చూపేది మాత్రం కేసీఆర్ అని చెప్పారు. తాను గెలిస్తే అది చేస్తా.. ఇది చేస్తా అంటూ బాండ్ పేపర్ మీద ఓ నాయకుడు రాసి ఇచ్చాడంటూ సెటైర్ వేశారు. బాండ్ పేపర్లు తెలంగాణలో చెల్లవు.. ఉత్తుత్తి హామీలు అసలే నడవవు అని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ అనే గ్యారంటీ, వారంటీ ఉండగా ప్రతిపక్షాల గ్యారంటీ కార్డులు పని చేయవన్నారు. కేసీఆరే రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ, వారంటీ అని చెప్పారు.