డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఉపయోగం లేదు

డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఉపయోగం లేదు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు..బీజేపీ రాష్ట్రాల్లో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన గజ దొంగలకు వేల కోట్లు మాఫీ చేసిన కేంద్రం..పేదల కోసం పథకాలు అమలు చేస్తాం అంటే ఉచితాలు వద్దు అంటోందని విమర్శించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 40 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. త్వరలో 57 ఏండ్లు నిండిన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని చెప్పారు.  డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అర్హులకు రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. వరదల్లో కాంగ్రెస్ బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి హరీష్ రావు,..పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.