
సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట పట్టణంలోని వైశ్య సదన్, గౌడ ఫంక్షన్ హాళ్లను నెలరోజుల్లో ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం పట్టణ శివార్ల లో నిర్మిస్తున్న ఆ రెండు ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికే మోడల్ గా వైశ్య సదన్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. చిన్నచిన్న పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆత్మగౌరవ ప్రతీకగా సిద్దిపేట గౌడ ఫంక్షన్ హాల్ నిర్మితమైందని, తుది మెరుగులు దిద్ది త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
టీహెచ్ ఆర్ నగర్లో బస్తీ దవాఖానాసిద్దిపేట పట్టణంలోని టీహెచ్ ఆర్ నగర్లో త్వరలోనే బస్తీ దవాఖానాను ప్రారంభిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆదివారం టీహెచ్ఆర్ నగర్ శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయ ఐదవ వార్షికోత్సవం, బోనాల జాతర లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీకి రేషన్ షాపు కావాలనే ప్రజల కోరికను నెరవేరుస్తామన్నారు. టీహెచ్ఆర్ నగర్ లో రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణానికి దశల వారీగా నిధులు విడుదల చేయిస్తామని హామీనిచ్చారు. అంతకు ముందు సుభాష్ నగర్ పోచమ్మ బోనాల కార్యక్రమంలో మంత్రిపాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.