పెంచేది బీజేపీ అయితే... పంచేది టీఆర్ఎస్

సమైక్య రాష్ట్రంలో ఏ కాలం చూసినా ఎండా కాలమే ఉండేదని.. కానీ స్వరాష్ట్రంలో ఏ కాలం చూసినా వానాకాలంలాగే ఉందని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. నంగునూరు మండలం నర్మేట గ్రామంలో EGS, CSR నిధులు 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పాడి పశువుల హాస్టల్, పాల సేకరణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హరీశ్ మాట్లాడారు.

‘మట్టిపనుల్లో రూ. 25 వేల కోట్ల రూపాయల కోతపెట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి నిలదీయాలి. తెలంగాణకు EGS కింద కూలీలకు 3 వేల కోట్ల పనిదినాలను తగ్గించడంపై కేంద్రాన్ని ప్రశ్నించాలి. కూలీలపై ప్రేమ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్టు రాష్ట్రంలో పనిదినాలను 13 వేల కోట్ల నుండి 16 వేల కోట్లకు పెంచేలా చూడాలి. అన్ని వర్గాల ప్రజల నోట్లో మట్టి కొట్టి.. సిగ్గు లేకుండా పాదయాత్రలు చేస్తారా? బండి సంజయ్‎ను సూటిగా ఓ ప్రశ్న అడుగుతున్నా. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు పెంచకుండా తొక్కి పెట్టినందుకా, వడ్లు కొననందుకా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచినందుకా, వంట గ్యాస్ ధర మంట పెట్టినందుకా, నిరుద్యోగులకు జాబ్‎లు ఇవ్వనందుకా, ఎరువుల ధరలు విపరీతంగా పెంచినందుకా... ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ముందు స్పష్టత ఇచ్చాకే పాదయాత్ర చేపట్టాలి. అలా కాకుండా పాదయాత్రలు చేస్తే తెలంగాణ ప్రజలు దంచి కొడతారు. ప్రజల ఆకాంక్షల నుంచి, వారి ఆశయ సాధన కోసం పుట్టిందే తెరాస పార్టీ. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతాం. ధరలు పెంచేటోడు బీజేపీ వాడైతే... పంచేటోడు టీఆర్ఎస్ వాడు. ఎవరు కావాలో... ప్రజలే తేల్చుకోవాలి’ అని మంత్రి హరీశ్ అన్నారు.

 

For More News..

రూ. 59కే రోజంతా మెట్రోలో ప్రయాణం

రాజ్యసభ నుంచి కొందరు పోతుంటరు.. కొందరు వస్తుంటరు

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావొద్దు