
సిద్దిపేట, వెలుగు: దేశానికి తెలంగాణ మోడలైతే రాష్ట్రానికి సిద్దిపేటను మోడల్ గా తీర్చిదిద్దామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బీసీబంధు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సిద్దిపేట గౌరవాన్ని మీరిచ్చిన బలం సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేశానన్నారు. సిద్దిపేట ప్రజల సేవ కోసం నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.
ఐటీ టవర్ ఏర్పాటుతో వెయ్యి మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో అత్యధికంగా బీసీ రుణాలు అందించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ మంజుల-రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.