కేంద్రం వెంటనే సీసీఐని పునరుద్ధరించాలి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ కోసం చేస్తున్న స్థానికులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని మంత్రి హరీష్ రావు సందర్శించారు.  సీసీఐ పున:ప్రారంభానికి టీఆర్ఎస్ తరపున పూర్తి మద్దతు తెలిపారు. అంతేకాకుండా తమ ఎంపీలు పార్లమెంటులో సీసీఐ కేంద్రం కోసం పోరాటం కూడా చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మీడియాతో మాట్లాడారు.

‘కేంద్రం వెంటనే సీసీఐని పునరుద్ధరించాలి. మీకు చేతకాకపోతే రాష్ట్రానికి అప్పజెప్పండి.. మేమే నడిపిస్తాం. రాష్ట్ర నిరుద్యోగ సగటు కంటే దేశ నిరుద్యోగ సగటు ఎక్కువగా ఉంది. ఆర్టీసీ, రైతు సేవా సంస్థలపై డీజిల్ భారం మోపడం అన్యాయం. ప్రభుత్వ రంగసంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ.. ప్రైవేటీకరణ  చేస్తున్నారు. గ్యాస్ పై సబ్సిడీ ఎత్తేసి.. పేదల బ్రతుకులు భారంగా మార్చారు. యూపీ ఎన్నికల ఫలితాల అనంతరం.. పెట్రో ధరలు అమాంతంగా పెంచేస్తారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం వేలకోట్లు కేటాయిస్తుంది’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

అంతకుముందు ఆయన ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రేఖా నాయక్, రాథోడ్ బాపు రావు, ఎమ్మెల్సీ దండే విఠల్ ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

For More News..

ఈ నెల 14 నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

ఒక్కరోజే 15 లక్షల చలాన్లు కట్టిన్రు 

విరాట్ వందో టెస్ట్ కు అనుష్క