
తమకు ఏకే 47 లాంటి కేసీఆర్ ఉండగా..డీకేలు, పీకేలు వచ్చినా ఏం చేయలేరని మంత్రి హరీశ్ రావు. రాష్ట్రంలో తెలంగాణా ద్రోహులంతా ఒక్కటవుతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బీజేపీకి, షర్మిల కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నవంబర్ 9న కేసీఅర్ నామినేషన్ వేయనున్న సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు హరీశ్ రావు. కేసీఆర్ కు ఓటేసి రుణం తీర్చుకోవాలని గజ్వేల్ ప్రజలు వేచి చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ గజ్వేల్ ను ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు. అభివృద్ధిలో గజ్వేల్ మూడు నాలుగు దశాబ్దాల ముందుకు వెళ్ళిందన్నారు.
కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డిలో వేస్తారని చెప్పారు హరీశ్ రావు. నవంబర్ 28న గజ్వేల్ లో కేసీఆర్ బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. పెద్దవాళ్లపై పోటీ చేస్తే తాము పెద్దవాళ్ళు అవుతామని ఇక్కడ కేసీఆర్ పై పోటీ చేస్తున్నారని తెలిపారు. గజ్వేల్ లో కేసీఆర్ పై ఇతరుల పోటీ నామ మాత్రమేనని చెప్పారు.
గజ్వేల్ లో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ పోటీచేస్తుండగా.. కాంగ్రెస్ నుంచి తూంకుంట నర్సారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.