కొమురవెళ్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్‌రావు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. వేద పడితుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత రూ.12 కోట్ల వ్యయంతో క్యూలైన్ల కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శంకుస్థాపన చేశారు.
మల్లన్న సాగర్ నీటితోనే సీఎం కేసీఆర్ స్వామివారికి అభిషేకం చేశారని మంత్రి హరీష్ రావు తెలిపారు. జాతీయ రహదారి నుంచి ఆలయం వరకు డబుల్ రోడ్ నిర్మాణ పనులను వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఆలయానికి సంబంధించిన వంద గదుల సత్రం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గుట్టపై దాతల సహకారంతో భక్తుల సౌకర్యార్థం గదులను నిర్మిస్తున్నామన్నారు. కొమురవెల్లి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. గతంలో ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ ఉండేవని కానీ.. ప్రస్తుతం ప్రతీ యేటా దాదాపు రూ.18 కోట్ల ఆదాయం వస్తోందని తెలపారు. మల్లన్న స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం సుభీక్షంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.