కేసీఆర్ హిందూ ధర్మ ప్రచారకుడు: హరీశ్ రావు

కేసీఆర్ నిజమైన హిందువని మంత్రి హరీశ్ రావు అన్నారు. కొంతమంది హిందువులంటూ ప్రచారం చేసుకుంటారు కానీ..కేసీఆర్ హిందూధర్మ ప్రచారకుడని అన్నారు. ఎన్నో దేవాలయాలను కేసీఆర్ కాపాడారని చెప్పారు. వరంగల్ జిల్లాలోని  పర్వతాల ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమానికి హరీశ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. పర్వతాల శివాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ ఆలయం గురించి సీఎం కేసీఆర్ కు వివరిస్తామని చెప్పారు. కాకతీయు పురాతన శివాలయం తిరిగి కట్టడం గొప్ప విషయమన్నారు. పురాతన ఆలయాన్ని పునరుద్దరించడం వంద కొత్త ఆలయాలు కట్టడంతో సమానమని అన్నారు.