అమిన్ పూర్ లోని పీసీసీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ఇంటికి మంత్రి హరీష్‌రావు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్. ఇవాళ నర్సాపూర్ లో జరిగే ప్రజా ఆశీర్వా్ద సభలో సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి నిన్న గాలి అనిల్ కుమార్ రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినా తనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు గాలి అనిల్ కుమార్. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఐదు సంవత్సరాలుగా కష్టపడ్డానని, అయితే.. సముచిత స్థానం దొరకలేదన్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ కోసం చాలా పని చేశానని, బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగిందని వాపోయారు. ఐదేళ్ల క్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో చేరానన్నారు.