మెట్ పల్లి, వెలుగు: ముస్లింలను ఫకీరులంటూ అవమానించిన మంత్రి హరీశ్ రావు ముస్లిం సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని మెట్ పల్లి మర్కజ్ ఇంతేజామీ కమిటీ మిల్లతే ఏ ఇస్లామియా అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మంత్రి హరీశ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ముస్లింలను ఫకీర్లుగా మాట్లాడడం సరికాదన్నారు. మైనార్టీలకు కుట్టు మిషన్లు, రూ.లక్ష సాయం..
ALSO READ :వర్షాలతో అల్లాడుతుంటే బర్త్ డే సంబురాలా: తుల ఉమ
స్కీంల ఆశ చూపి మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో షేక్ సాదక్ హుస్సేన్, మహమ్మద్ సమియుద్దీన్, రహీముద్దీన్, మహమ్మద్ ఫిరోజ్ పాల్గొన్నారు.