
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ లీడర్లతో పాటు వారి సతీమణులు కూడా ప్రచారంలో హుషారుగా పాల్గొంటున్నారు. నవంబర్ 26న ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీష్ రావు సతీమణి శ్రీనిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గల్లీ గల్లీకి తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి.. భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు, కార్యక్తరలు అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు.