ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నేడు జుక్కల్‌కు మంత్రి హరీశ్‌రావు

పిట్లం, వెలుగు: పిట్లంలో 30 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు, మార్కెట్​ యార్డులోని దుకాణ సముదాయాలను ప్రారంభించేందుకు మంత్రి హరీశ్‌రావు నేడు జుక్కల్‌కు రానున్నారని ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే చెప్పారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో ఎళ్లుగా పిట్లం వాసులు ఎదురు చూస్తున్న హాస్పిటల్ కల నేడు తీరనుందని చెప్పారు. ఇక్కడ ప్రోగ్రామ్‌ పూర్తయిన తర్వాత మంత్రి బిచ్కుందలో  డయాలసిస్ సెంటర్‌‌ను, కొత్తగా ఏర్పాటైన డోంగ్లి మండలంలో తహసీల్దార్‌‌ ఆఫీసును ప్రారంభిస్తారని చెప్పారు. 

పాత కలెక్టరేట్‌ ఇక కనుమరుగు..

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఎంతో మంది అధికారులకు ఆశ్రయం ఇచ్చిన భవనాలు అవి.. ఎంతో మంది సమస్యలను పరిష్కరించిన ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు.. ఎప్పుడూ జనంతో కిటకిటలాడిన  ఆ ప్రాంగణాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మరికొన్ని రోజుల్లో పూర్తిగా కనుమరుగుకానున్నాయి. అభివృద్ధిలో భాగంగా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇటీవల ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పాత భవనాలు ఖాళీ అవడంతో వాటిని కూల్చివేస్తున్నారు. వీటి స్థానంలో కొత్త బస్టాండ్, కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. - వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్

డబుల్​బెడ్ రూం  ఇండ్లకు భూమిపూజ

బోధన్, వెలుగు: సాలూర మండలంలోని కొప్పర్తి క్యాంప్ గ్రామంలో డబుల్​బెడ్​రూం ఇండ్ల నిర్మాణానికి శుక్రవారం ఎంపీపీ  బుద్దె సావిత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 10 మంది నిరుపేదలు ఉండడంతో సర్పంచ్ సుశీల ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. డీసీసీబీ డైరెక్టర్ శరత్, రైతు బంధు మండ ల మాజీ  కోర్డినేటర్ బుద్దె రాజేశ్వర్, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సాలూర షకీల్, బోధన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నరసన్న, సాలంపాడ్ ఎంపీటీసీ కందిమల్ల వెంకట్రావు, యూత్ ప్రధాన కార్యదర్శి మజర్ అలీ,  బుజ్జి, శ్రీనివాసరావు, సతీశ్‌, కృష్ణ పాల్గొన్నారు. 

ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌‌రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందులో భాగంగానే హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌తో ఇంటింటికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి హెల్త్ కిట్లు పంపిణీ చేస్తోందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌‌రెడ్డి చెప్పారు. మండలంలోని చేపూర్‌‌‌‌లో హెల్త్ కిట్స్‌‌ పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కొమురం భీమ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించడంతో పాటు గూండ్ల చెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను ప్రారంభించారు. 365 రోజులు నీటితో కళకళ లాడే గుండ్ల చెరువు మధ్యలో ఐలాండ్ నిర్మాణం,  బోటింగ్‌‌కు వచ్చే పర్యాటకులకు మంచినీటి వసతి, బ్రేక్ ఫాస్ట్ సౌకర్యాలు కల్పించడంతో పాటు ఒక వసతి గృహం నిర్మించాలని ఆఫీసర్లకు సూచించారు. అనంతరం కస్తూర్భా స్కూల్ అదనపు గదులను ప్రారంభించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, చేపూర్ సర్పంచ్ ఇందూర్ సాయన్న, డిప్యూటీ డీఎంహెచ్‌‌వో రమేశ్‌‌, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

ఉద్యోగాల భర్తీ కోసం బీజేవైఎం ధర్నా

కామారెడ్డి, వెలుగు:  ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నోటిఫికేషన్ల పక్రియ త్వరగా చేపట్టాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లాలోని తహసీల్దార్‌‌ ఆఫీసుల ముందు బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కామారెడ్డి తహసీల్దార్‌‌ ఆఫీసు ఎదుట జరిగిన ధర్నాలో స్టేట్ లీడర్ నరేందర్‌‌రెడ్డి మాట్లాడుతూ నోటిఫికేషన్లు ఇవ్వటం కాకుండా ఎగ్జామ్స్ నిర్వహించి సెలక్ట్ అయిన వారికి అపాయింట్‌మెంట్‌ లెటర్‌‌ అందజేయాలన్నారు. టౌన్ ప్రెసిడెంట్ వేణు, లీడర్లు రాజేశ్‌, భరత్, శరత్, లింగం తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్‌‌లో జరిగిన ఆందోళనలో మండల శాఖ ప్రెసిడెంట్ ప్రేమ్‌రెడ్డి, లీడర్లు రమేశ్‌రెడ్డి, జీవన్‌రావు పాల్గొన్నారు.  

కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం : ఎంపీ అర్వింద్

నిజామాబాద్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పా రు. ఢిల్లీలో బీజేపీ ప్రెసిడెంట్​ జేపీ నడ్డాను శుక్రవారం అర్వింద్ కుటుంబ సభ్యులతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర రాజకీయాలపై ముచ్చటించారు. ఎంపీ కాన్వాయ్, ఇంటిపై దాడుల ఘటనలపై నడ్డా అడిగి తెలుసుకున్నారు. ప్రజాసంగ్రామ యాత్రకు టీఆర్ఎస్ పాలకులు కల్పిస్తున్న ఆటంకాలపై ఆరా తీశారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాంను ఎంపీ మర్యాద పూర్వకంగా కలిశారు. బీసీల హక్కులను పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరినట్లు అర్వింద్‌ చెప్పారు.

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే జాజాల సురేందర్​

లింగంపేట, వెలుగు: నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జాజాల సురేందర్ చెప్పారు. మండలంలోని భవానీపేటలో రూ.3.23 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గ్రామస్తులంతా బీటీ రోడ్డు వేయించాలని కోరారని, వారికి ఇచ్చిన మాట ప్రకారమే రోడ్డు మంజూరు చేసినట్లు చెప్పారు. నెల రోజుల్లో కొట్టాల్ గ్రామం నుంచి కంచ్‌మల్‌ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తవుతాయని చెప్పారు.

ఆంధ్ర పాలకుల పాలనలో తెలంగాణ పూర్తిగా వెనుకబడిందని, ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మనం దూసుకపోతున్నామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని పేదలందరికీ త్వరలో డబుల్ బెడ్​రూం ఇండ్లను మంజూరు చేస్తానని, అర్హులైన వారికి దళిత బంధు స్కీం కింద యూనిట్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుతోట నర్సమ్మ, ఎంపీపీ గరీబున్నీసా, జడ్పీటీసీ ఏలేటి శ్రీలత, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ఆర్అండ్‌బీ డీఈఈ నారాయణ,  ఏఈ రవితేజ, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, సింగిల్​విండో చైర్మన్లు దేవేందర్‌‌రెడ్డి, రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్ పాల్గొన్నారు.