మీరు సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది

మీరు సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది

తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఆర్థిక శాఖమంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ వల్లే ప్రత్యేక తెలంగాణ కల నెరవేరిందని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే తెలంగాణ తలరాత మారిందని.. ఆయన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోతున్నదని మంత్రి హరీష్ అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆయనకు శభాకాంక్షలు తెలుపుతూ హరీష్ రావు ట్వీట్ చేశారు.

‘దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకు పోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి.. ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది.

మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.

For More News..

కార్పొరేట్ కాలేజీల వెనుక టీఆర్ఎస్ పెద్దలు

మూడు పార్టీలకు సాగర్ ఎన్నిక సవాల్

గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడీ తొలగింపు

కొత్త బార్లకు 8 వేల అప్లికేషన్లు.. ఒక్క బార్‌కు మాత్రం 317 అప్లికేషన్లు