మంత్రి హరీష్‌ రావు హెలికాఫ్టర్‌ రాంగ్‌ ప్లేస్లో ల్యాండింగ్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా నవంబర్ 25న మహబూబాబాద్ కు వెళ్తున్న మంత్రి హరీష్ రావు హెలికాఫ్టర్‌ సమన్వయ లోపంతో రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయింది.  దీంతో ఒకచోట దిగాల్సిన  హెలికాఫ్టర్‌ మరోచోట దిగింది.  మహబూబాబాద్ లో ల్యాండ్ కావాల్సిన హెలికాఫ్టర్‌ సమన్వయ లోపంతో గూడూరు మండల కేంద్రంలో దిగింది. 

దీంతో మంత్రి తన పీఏపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది ఏమీ లేకా అందుబాటులో ఉన్న కారులో మహబూబాబాద్ రోడ్ షోకు బయలుదేరారు  హరీశ్‌రావు.  ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో వరుస పర్యటనలతో హోరేత్తిస్తున్నారు హరీష్ రావు.