కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ

కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావుకు నిరసన సెగ తగిలింది. నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ బీజేపీ యువ మోర్చా నాయకులు పిట్లం మండలంలో ఆందోళన చేపట్టారు. మంత్రి హరీష్ రావు గో బ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. హరీష్ రావును అడ్డుకునేందుకు బీజేపీ యువమోర్చా నేతలు ప్రయత్నించారు.

కాన్వాయ్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది.