సీఎంను హుజురాబాద్ రాకుండా కుట్ర చేశారు 

సీఎంను హుజురాబాద్ రాకుండా కుట్ర చేశారు 

సీఎంను హుజురాబాద్ రాకుండా కుట్రలు చేశారన్నారు మంత్రి హరీశ్ రావు.  ఎన్నికల కోడ్ తో అడ్డుకున్నా ప్రజలు అండగా ఉంటారన్నారు మంత్రి హరీశ్ రావు.  గెల్లుగెలుపు ఖాయం కావడంతో కొందరు ప్రస్టేషన్ తో ఫోన్లు నేలకు కొడుతున్నారన్నారు. టీఆర్ఎస్ ఓటుకు రూ.20 వేలు ఇస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు.  ఎన్నికలు ఏవైనా టీఆర్ఎస్ ను ప్రజలు ఆశీర్వదించారన్నారు. బీజేపీ అబద్ధాలతో ప్రచారం చేసిందన్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ దే విజయమని చెప్పాయన్నారు.  ఏడేళ్ల బీజేపీ పాలనలో పెట్రో ధరలు పెంచారన్నారు. గత నెల రోజులుగా బీజేపీ రాష్ట్రనాయకులు హుజురాబాద్ లో ప్రచారం చేశారన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా పరుష పదజాలంతో టీఆర్ఎస్ పై విమర్శలు చేశారన్నారు. గెలిస్తే ఏం చేస్తారో ఈటల చెప్పలేదన్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వా గ్యాస్ ధరను మరో రూ.250 పెంచుతారన్నారు. ఒక వేళ పెంచబోరని  బీజేపీ నేతలు మాట ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.

దళితబందుపై బీజేపీ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపై  కేంద్ర ఎన్నికల సంఘం స్పందించిందన్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీది తొండాట..మొండి మాటలు మాట్లాడరన్నారు. రైతులు ,దళితుల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదన్నారు. రైతుల మీద కేంద్రమంత్రి కొడుకు కారెక్కించి చంపితే బీజేపీ నేతలు మాట్లాడటం లేదన్నారు.  రైతుబంధు, రైతుభీమా దేశంలో ఎక్కడా లేదన్నారు. ఏడేళ్ల బీజేపీ,టీఆర్ఎస్ పాలనపై చర్చకు రావాలని సవాల్ వేస్తే ఇంత వరకు తమ సవాల్ ను స్వీకరించలేదన్నారు.