రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఒక్క పైసా ఇస్తలే : హరీష్ రావు

మునుగోడు ప్రజల ఫ్లోరైడ్ బాధలు తీర్చడానికి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. త్వరలోనే శివాన్నగూడెం రిజర్వాయర్ను పూర్తి చేసి ఫ్లోరైడ్ను తరిమికొడతామని చెప్పారు. మర్రిగూడెం మండలం రాజుపేటతండాలో గ్రామస్థులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ పథకాలకు కేంద్రం ఒక్కపైసా ఇవ్వడంలేదని ఆరోపించారు. అయితే బీజేపీ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని.. అబద్దాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 

కృష్ణా జిల్లాలో వాటా తేల్చని బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదని హరీష్ రావు విమర్శించారు. లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుని.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసే కార్యక్రమాన్ని కేంద్రం ముమ్మరం చేసిందని ఆరోపించారు. బీజేపీ వచ్చాక దేశంలో ఆకలి పెరిగిపోయిందని..పేదరికంలో మనదేశం 107 స్థానంలో ఉందని అన్నారు.