మీకు అది రాజనీతి అవుతుందా? బీజేపీ జాతీయాధ్యక్షుడికి హరీష్ రావు ప్రశ్న

మీకు అది రాజనీతి అవుతుందా? బీజేపీ జాతీయాధ్యక్షుడికి హరీష్ రావు ప్రశ్న

‘దేశ రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు. అలా చేస్తే సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా?’ అని తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు.. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రశ్నించారు. కరోనా నియంత్రణలో రాష్ట్రాలను తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదని హరీష్ సూచించారు. ఆ విషయానికి సంబంధించి మంత్రి హరీష్ రావు తన ట్విట్టర్ ఖాతాలో ఒక ట్వీట్ చేశారు. దానికి జేపీ నడ్డాను ట్యాగ్ చేశారు. ఆ ట్వీట్ మీకోసం యధావిధిగా..

‘సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, ప్రాణాలకు లెక్క చేయకుండా కరోనా పై పోరాడుతున్న వైద్యులు ఒక్కటే అని కదా మనం అనుకుంటున్నది. ప్రధాన మంత్రి మోడీ గారు కూడా అదే కదా చెప్తున్నారు. దేశ రక్షణ విషయంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం అనుచితం కాదని మీరే అంటారు. అలా చేస్తే సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతీస్తుందని ఉద్బోదిస్తారు. మరి కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? దేశానికి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరే.. వైద్యులు చేస్తున్నకృషిని తక్కువ చేసి చూపడం సబబా? ఇది వైద్య సిబ్బంది ఆత్మస్థైర్యం దెబ్బతీసే చర్య కాదా? మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా.. మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోన విషయంలో రాజకీయాలు చేయడం దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం. దయచేసి ఇది గుర్తుంచుకోవాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారిని కోరుతున్నా’ అని ట్వీట్ చేశారు.

For More News..

వీడియో: 85 ఏళ్ల వయసులో బామ్మ యోగాసనాలు