ములుగు, వెలుగు : రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మెడికల్ కాలేజీ శంకుస్థాపనకు రాష్ర్ట ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఈనెల 28న ములుగుకు రానున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. మంగళవారం మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ఆలంలతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండారుపల్లి రోడ్డులోని తంగేడు మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, డీపీవో వెంకయ్య, తహసీల్దార్ విజయ భాస్కర్ పాల్గొన్నారు.