- మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి
ఆదిలాబాద్/నార్నూర్/బజార్ హత్నూర్/నేరడిగొండ/గుడిహత్నూర్,వెలుగు: మాత శిశు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. బుధవారం ఆదిలాబాద్‌లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ మంత్రి అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందన్నారు. మాతా శిశు మరణాలను అరికట్టడంలో దేశంలోనే రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో ఆయా మండలాల్లోనూ ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు కిట్లు పంచారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఎస్టీ కమిషన్ సభ్యురాలు నీలాబాయి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అడిషనల్ కలెక్టర్ నటరాజ్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీఎంహెచ్‌వో నరేంద్ర రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి లైవ్ లోకేషన్ స్టార్ట్
- కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ
నిర్మల్,వెలుగు: ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీల విధులు పర్యవేక్షించేందుకు గురువారం నుంచి లైవ్ లొకేషన్ సిస్టం స్టార్ట్చేస్తున్నట్లు కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్ లో శానిటేషన్ పై రివ్యూ నిర్వహించారు. క్రీడా ప్రాంగణాలు, విలేజీ పార్కులు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డ్స్, శ్మశానవాటికలు, ఇంటిగ్రేటెడ్మార్కెట్భవనాలు, మిషన్ భగీరథ, వాటర్ ట్యాంక్స్ తదితర పనులు త్వరితగతిన పూర్తిచేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు. రోడ్లపై మట్టి తొలగించి ఇరువైపులా మొక్కలు నాటించాలన్నారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు, సెక్రటరీలు విధిగా ఫీల్డ్ లో ఉండాలన్నారు. డీపీవో, డీఆర్డీవో పీడీలు కలెక్టరేట్ నుంచి మానిటరింగ్చేయాలన్నారు. శానిటేషన్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో పీడీ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషన్లు సంపత్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.
జైనథ్ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
ఆదిలాబాద్, వెలుగు: జైనథ్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ బుధవారం ఎమ్మెల్యే జోగురామన్న సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసింది. చైర్‌పర్సన్‌గా గోడం వర్ష, వైస్ చైర్మన్వేణుగోపాల్ యాదవ్, డైరెక్టర్లు బట్టు సంతోష్, విశాల్, సయ్యద్ సర్దార్, మొహ్మద్సాదిఖ్, బెడోద్కర్ సంతోష్, రమేశ్, శివ ప్రసాద్ రెడ్డి, రవీందర్‌రెడ్డి, సురేందర్ రెడ్డి, సుభాష్, విశాల్ గుర్నులే, వైద్య కిషన్ రావు ప్రమాణం చేశారు. అనంతరం వారిని ఎమ్మెల్యే సన్మానించారు.
బీజేపీ మండల కమిటీ ఎన్నిక
దహెగాం,వెలుగు: బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, దహెగాం మండల అధ్యక్షుడు రాపర్తి ధనుంజయ ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల ఉపాధ్యక్షులుగా సింగం నారాయణ, గొండె రాజేశ్, రౌతు రాజన్న, జునుగరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా ఉంద్రి శ్రీకాంత్, కార్యదర్శులుగా తాళ్ల రాజలింగు, చమ్మకరి రమేశ్, చౌదరి ఇస్తారి, గోమాస శంకర్, గోమాస శంకర్, ట్రెజరర్‌గా ఎల్కరి సంజీవ్, సభ్యులుగా దందెర రాజు, చౌదరి మధూకర్, చెమ్మకరి గంగన్న, పాలె మల్లేశ్, సాపిల వెంకటేశ్, సడెంక మురళి, వెన్నంపల్లి సుధాకర్, పసుల నాగరాజు, దందెర బండయ్య ఎన్నికయ్యారు.
పురుగుల అన్నంపై ఐదునెలల తర్వాత విచారణ
కాగ జ్ నగర్, వెలుగు: ఆశ్రమ పాఠశాలలో పురుగుల అన్నంపై ఐదు నెలల తర్వాత ఆఫీసర్లు ఎంక్వైరీకి వచ్చారు. కౌటాల మండలం మొగడ్ధగడ్రెసిడెన్షియల్హైస్కూల్లో జూన్ నెల ఆఖరి రోజు అన్నంలో పురుగులు వచ్చాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇదే విషయమై మీడియాలో వార్తలు వచ్చాయి. స్పందించిన ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. అయితే ఐదు నెలల తర్వాత బుధవారం డీఈవో అశోక్, ఏడీ రాధాకిషన్విచారణ చేశారు. విద్యార్థులు, సిబ్బంది నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలి
కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం
ఖానాపూర్,వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికా రంలోకి తీసుకురావడమే లక్ష్యమని పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెడ్మ బొజ్జు పటేల్ చెప్పారు. బుధవారం ఖానాపూర్ లోని జేకే గార్డెన్ లో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కార్యకర్తలు సైనికుళ్లా పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేయాలన్నారు. అనంతరం ఆయనను పార్టీ మండల, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజురా సత్యం, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు దయానంద్, షబ్బీర్ పాషా, పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, జమా మజీద్కమిటీ మాజీ అధ్యక్షుడు జహీర్, జడ్పీ మాజీ కో ఆప్షన్‌మెంబర్ యూసుఫ్ ఖాన్, శ్యామ్, గంగ నర్సయ్య, సలీం ఖాన్, శంకర్, శౌకత్, శ్రీనివాస్, లక్ష్మీపతి, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఈద్గా నిర్మించాలి
ఖానాపూర్,వెలుగు: ఖానాపూర్ లో మరో కొత్త ఈద్గా మంజూరు చేయాలని, ఉర్దూ భవన్‌కు మరమ్మతులు చేయించాలని స్థానిక మైనార్టీ లీడర్లు బుధవారం కలెక్టర్ముషారఫ్అలీ ఫారూఖీని కోరారు. సమస్య పరిష్కా రానికి చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, జామా మజీద్ అధ్యక్షుడు అంజద్ ఖాన్, ఏఎంసీ డైరెక్టర్ మెహరాజొద్దీన్తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు
నిర్మల్,వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేటీ ఆర్ వ్యాఖ్యలు సరికాదని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రావుల రామనాథ్ పేర్కొన్నారు. బుధవారం నిర్మల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ నాయకుడైన బండి సంజయ్ పై కేటీఆర్ దొరల అహంకారాన్ని ప్రదర్శించారన్నారు. అవినీతి అక్రమాల్లో ఇరుక్కుపోయిన కేటీఆర్ ప్రజలను పక్కదోవ పట్టించేందుకే తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో నైతిక విలువలు లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.
ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
నిర్మల్,వెలుగు: బాధితుల నుంచే వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ ప్రవీణ్ కుమార్ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ఆఫీసులో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో రివ్యూ నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. భైంసా ఎస్పీ కిరణ్ ఖారే, నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి
ఇచ్చోడ,వెలుగు: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏ ఐటీయూసీ మండల కార్యదర్శి కల్లేపల్లి గంగయ్య డిమాండ్‌చేశారు. బుధవారం సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సివిల్ సప్లై కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ఈఎస్ఐ కార్డ్స్ ఇవ్వాలని, ఉద్యోగ విరమణ చేసిన వారికి రూ.10 వేల పెన్షన్ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం లీడర్లు ఎం.శంకర్, రాజేందర్, మహేశ్భూమయ్య, మెడపట్ల వెంకటేశ్, మచ్చ నరేశ్, కల్లేపల్లి నరేశ్, సాయి, లక్ష్మణ్, ఎం.వినోద్. వర్కర్స్ ఎం. రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలకు రెడీ కావాలి
ఆదిలాబాద్, వెలుగు: ఎప్పుడు ఎన్నికలొచ్చినా కార్యకర్తలు రెడీగా ఉండాలని బీజేపీ జిల్లా ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్ సూచించారు. బుధవారం బీజేపీ జిల్లా పదాధికారుల సమావేశం స్థానిక ఎస్టీయూ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని పోలింగ్ బూత్ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, లీడర్లు రాకేశ్, ఆధినాథ్, సుహాసిని రెడ్డి, నగేశ్, మురళీధర్, జోగు రవి, లాలా మున్న, దినేశ్మాటోలియ, విజయ, మయూర్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకాలం నాటి వేతనాలు చెల్లించాలి
బెల్లంపల్లి,వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్కార్మికుల సమ్మె కాలం నాటి వేతనాలు చెల్లించాలని బుధవారం బెల్లంపల్లిలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నిరసనలో ఎస్ సీసీడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. బ్రహ్మానందం, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, ఎస్ సీసీడబ్ల్యూయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాఫర్, లీడర్లు ఎన్.కృష్ణవేణి, జి.వెంకటి, శ్యామ్, అబ్దుల్లా, రవి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ రక్తదానం
నిర్మల్,వెలుగు: నిర్మల్గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ టెక్నిషియన్‌గా పనిచేస్తున్న విజయకు ఖానాపూర్మున్సిపల్చైర్మన్అంకం రాజేందర్రక్తదానం చేశారు. బుధవారం విజయకు శస్త్రచికిత్స అయ్యింది. ఆమె బ్లడ్‌గ్రూప్ ‘బి’ నెగటివ్. బాడీలో రక్తం తక్కువగా ఉండడంతో ఆ గ్రూప్ ఎక్కడా దొరకలేదు. విషయం తెలుసుకున్న అంకం రాజేందర్ హుటాహుటిన నిర్మల్ కు వచ్చి రక్తం దానం చేశారు. ఆపదలో ఆదుకున్న మున్సిపల్చైర్మన్ను పలువురు అభినందించారు.
‘మహా’ సరిహద్దుల్లోకి బీఆర్ఎస్
నిర్మల్,వెలుగు: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తెలంగాణ సరిహద్దులు దాటుతోంది. గురువారం సారంగాపూర్ మండలానికి సమీపంలోని మహారాష్ట్రకు చెందిన శివుని గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్‍రెడ్డి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నారు. ఆయన ఇప్పటికే శివునితో పాటు ఆనుకొని ఉన్న అప్పారావుపేట తదితర గ్రామాల లీడర్లతో చర్చించారు. ముథోల్ నియోజకవర్గానికి సరిహద్దులోని గ్రామాల్లో కూడా పార్టీ కార్యకలాపాలు స్టార్ట్ చేయనున్నారు.
సజీవ దహనం నిందితులకు రిమాండ్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా గుడిపల్లి సజీవ దహనం ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని బుధవారం సాయంత్రం జిల్లా అదనపు సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కాసిపేట పోలీస్ స్టేషన్లో ఉన్న నిందితులను బస్సులో మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఏ1 మేడి లక్ష్మణ్, ఏ2 శనిగరపు సృజన, ఏ3 రమేశ్, ఏ4 సమ్మయ్య, ఏ5 అంజయ్యను కోర్టులో హాజరుపర్చారు. వారికి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
రాంజీ గోండు ఆశ్రమానికి సింగరేణి సాయం
మందమర్రి,వెలుగు: బెల్లంపల్లిలోని రాంజీగోండు ఆశ్రమానికి సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో జీఎం చింతల శ్రీనివాస్బుధవారం రూ.1.60 లక్షలు ఆశ్రమ నిర్వాహకులకు అందించారు. ఏరియా కేకే1 డిస్పెన్సరీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే మద్దెల శంకర్ కుమార్తె పావనికి, ఆర్కే ఓసీపీ ఈపీ ఆపరేటర్ డి.శంకర్ కూతురు అనీలకు జీఎం రూ.10 వేల చొప్పున మెరిట్ స్కాలర్ షిప్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈ స్టోర్స్ పైడిశ్వర్, పర్సనల్ హెచ్ వోడీ శ్యాంసుందర్, సీనియర్ పీవోలు మైత్రేయబంధు, సత్యబోస్, ఓఎస్ రాజలింగు, కార్మిక సంఘాల లీడర్లు రమణ, దాగం మల్లేశ్, రాంజీగోడు ఆశ్రమం నిర్వాహకులు
తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అయ్యప్ప మహాపడిపూజ
జైనథ్ మండలం దీపాయిగూడ, ఖానాపూర్‌లో బుధవారం అయ్యప్ప మహాపడి పూజ, అరట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. దీపాయిగూడలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్‌రెడ్డి, ఎంపీటీసీ లోక కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఖానాపూర్‌లో మాజీ జడ్పీటీసీ రామునాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గురు స్వాములు పాపారావు, రాజురా సత్యం, రాజన్న, సురేశ్ కుమార్, శ్యామ్ రావ్, రవీందర్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ పాల్గొన్నారు.-ఆదిలాబాద్‌టౌన్/ఖానాపూర్,వెలుగు
చేతి వృత్తిదారులకు అండగా ఉంటాం
కాగజ్ నగర్,వెలుగు: చేతివృత్తిదారులకు అండగా ఉంటామని బీసీ వెల్ఫేర్ జిల్లా ఆఫీసర్ సత్యనారాయణ, పర్యాటకశాఖ అధికారి రామకృష్ణ తెలిపారు. బీహెచ్ఈఎల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం కౌటాల మండలం తలోడి గ్రామ కుమ్మరులకు15 రోజుల శిక్షణ ప్రారంభించారు. మట్టి పాత్రల తయారీ, మార్కెటింగ్‌కోసం కలెక్టర్ రాహుల్ రాజ్, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పేయ్ చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్, ప్రధాన కార్యదర్శి మొండి, ఉపాధ్యక్షుడు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.