అభివృద్ధిలో కరీంనగర్​ దూసుకెళ్తోంది : గంగుల కమలాకర్

  •     మంత్రి గంగుల కమలాకర్

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్ అభివృద్ధిలో దూసుకెళ్తోందని, సిటీని బ్యూటిఫుల్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం మానేర్ బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన హైమాస్ట్​  లైట్లను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన సిటీని అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.  

అంతకుముందు 9,16వ డివిజన్లలో  వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు  నిర్వహించారు. బీఆర్ఎస్  సిటీ ప్రెసిడెంట్ హరిశంకర్, కార్పొరేటర్లు  శారద, శ్రీకాంత్,  లీడర్​ ప్రమోద్ రావు పాల్గొన్నారు. 

ALSO  READ :-  అక్టోబర్1న పాలమూరు, 3న ఇందూరులో సభలు : కిషన్ రెడ్డి

కొత్తపల్లి: గణేష్ నిమజ్జనం సందర్భంగా కొత్తపల్లి చెరువు వద్ద మంత్రి గంగుల కమలాకర్​, కలెక్టర్​ గోపి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ

కరీంనగర్ రూరల్ : పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్లు   చెప్పారు. ఎంపీపీ లక్ష్మయ్య, ప్యాక్స్​ చైర్మన్  శ్యామ్‌‌‌‌‌‌‌‌సుందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మధు, సర్పంచ్  భారతి, రమణ రెడ్డి, ఎంపీటీసీ తిరుపతి, నందయ్య, ఐలయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.