ఇంటింటికి మంచి నీళ్లివ్వాలని మిషన్ భగీరథ తీసుకొస్తే…తన సొంత ఊరికే నీళ్లు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఇప్పటికే నాలుగైదు సార్లు అధికారులకు చెప్పినా…. ఫలితం లేదన్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో ఆదిలాబాద్ లో సమావేశమయ్యారు మంత్రి. మిషన్ భగీరథ పురోగతిపై సమీక్షించారు. అధికారుల అలసత్వం వల్లే ఇంటింటికి మంచినీరు ఆలస్యం అవుతోందని అన్నారు.