నిర్మల్​ను స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దుతాం: మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్,వెలుగు: నిర్మల్​ను స్పోర్ట్స్​హబ్​గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం ఆయన స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాష్ట్ర సీనియర్​బాలికల సాఫ్ట్ బాల్ పోటీలను మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్​తో కలిసి ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ క్రీడాకారులకు గుర్తింపు కరువైందన్నారు. ఇప్పడు తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, ఎఫ్ఎస్ సీఎస్ చైర్మన్ రాజేందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్, జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దశరథ పోశెట్టి, సెక్రటరీ అన్నపూర్ణ, పెటా అధ్యక్షుడు భూక్యా రమేశ్, సెక్రటరీ భోజన్న, జనరల్ సెక్రటరీ రమణారావు, పీడీలు భూమన్న, శ్రీనివాస్, జమున, సంగీత, శ్వేత, సంజు పాల్గొన్నారు.