వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

లోకేశ్వరం, వెలుగు: పంటలు అమ్మేటప్పుడు రైతులు దళారులను నమ్మి, మోసపోవద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రాజుర గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్​ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో  ధాన్యం అమ్ముకొని ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి , కలెక్టర్ వరుణ్ రెడ్డి, జేసీ రాంబాబు, డీఎం శ్రీకళ విద్యుత్ శాఖ ఎస్సీ చౌహాన్ 
పాల్గొన్నారు.