కాగజ్ నగర్, వెలుగు: కేంద్ర ఎన్నికల కమిషన్ టీమ్ వచ్చేనెల మొదటి వారంలో రాష్ట్రానికి వస్తోందని, తొందరలోనే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు బీఆర్ఎస్ పూర్తి రెడీగా ఉందన్నారు. శుక్రవారం సిర్పూర్ (టీ )నియోజక వర్గంలో రూ.140 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లతో కలిసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ సర్కార్ దే అని అన్నారు. మూతపడ్డ సిర్పూర్ పేపర్ మిల్లును పునర్ ప్రారంభించి సక్సెస్ గా నడిపిస్తున్నామన్నారు.
'సర్వేలన్నీ బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని, కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా కౌటల, చింతలమానేపల్లి మండలాల నుంచి పలువురు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవ్ రావు , మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ , రైతుబంధు జిల్లా అధ్యక్షుడు జగ్గా గౌడ్ , ఎంపీపీలు విశ్వనాథ్, నానయ్య, జడ్పీటీసీ శ్రీదేవి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.