కొత్త కరెంట్​పాలసీకి మేం వ్యతిరేకం : మంత్రి జగదీష్​ రెడ్డి

సూర్యాపేట : కేంద్రం తీసుకురానున్న విద్యుత్ విధానానికి తాము వ్యతిరేకమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఛార్జీలను డిస్కంలకు ముందుగానే చెల్లించాలన్న కేంద్రం నిర్ణయాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. విద్యుత్ రంగం ప్రైవేటీకరణ కోసమే ఈ ఎత్తులన్నీ వేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రం ఉచితంగా విద్యుత్ పంపిణీ చేయడం చూసి కేంద్రం ఓర్వలేకపోతుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించినా ఉచిత విద్యుత్ ను ఆపే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. అన్నం పెట్టే రైతుల ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచేందుకు సబ్సిడీలు ఇస్తున్నామన్న జగదీశ్ రెడ్డి కేంద్రం ఫ్యూడల్ ఆలోచనలతో పేదలకు నష్టం కలుగుతోందని అన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు.