దేశంలో కేసీఆర్ ను ఆపే శక్తి ఎవ్వరికి లేదు

కాంగ్రెస్ పాలనలో మునుగోడులో కరువు తాండవించిందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఫ్లోరైడ్   భూతంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్  వచ్చిన తర్వాతే మునుగోడు దశ దిశ తిరగిందని.. ఫ్లోరైడ్ అంతం అయిందన్నారు.  ఇతర రాష్ట్రాల ప్రజలు ముఖ్యమంత్రి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ  తమకు కావాలని అడుగుతున్నారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఎదుగుతున్నందుకే  కేంద్రం కేసీఆర్ ను  చూసి ఓర్వలేకపోతుందని....అందుకే తెలంగాణపై విషం చిమ్ముతున్నదని స్పష్టం చేశారు. 

బీజేపీ నాయకులు మిడతల్లాగా వచ్చి తెలంగాణపై  దాడి చేస్తున్నరని మండిపడ్డారు. దేశంలో కేసీఆర్ ను ఆపే శక్తి ఎవ్వరికి లేదన్నారు. మునుగోడులో  గులాబి పార్టీ   కార్యకర్తలు సైనికుల్లా   పని చేయాలని సూచించారు.  మునుగోడులో గెలిచేది  అధికార పార్టీయే అని..టీఆర్ఎస్ ను  గెలిపిస్తేనే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం,గట్టుపల్  మండల కేంద్రలో టీఆర్ఎస్  పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొని..కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.