పెన్ పహాడ్, వెలుగు: దళితులు బీఎస్పీకి అమ్ముడుపోతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి కామెంట్ చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శమని పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు నకరికంటి వెంకన్న, మండల అధ్యక్షుడు భీమ్పంగి నాగరాజు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే మంత్రిని ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. ఓటమి తప్పదని భావించిన మంత్రి బహుజనులకు రాజ్యాధికారం దక్కొద్దనే అక్కసుతోనే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని ఆరోపించారు.
దళిత బంధు ఇస్తామని మోసం చేసిన బీఆర్‌ఎస్ పార్టీని, మంత్రిని దళితులు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. బీసీ నేత, బీఎస్పీ పార్టీ అభ్యర్థి వట్టె జానయ్య యాదవ్ మంత్రి వ్యవహరించిన తీరు ప్రజలంతా చూశారని, వచ్చే ఎన్నిల్లో గుణపాఠం తప్పదన్నారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఎస్పీలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండమీది బుచ్చిబాబు, రణపంగ శ్రవణ్ పూలే, ఒగ్గు వెంకన్న, రన్నప్పంగ రాజేశ్, గుద్దిళ్ల శాంసన్, మచ్చ నరేశ్, మురళి, వినయ్, దుర్గ ప్రసాద్, తరుణ్ పాల్గొన్నారు.