రైతులకు అన్యాయం చేసిన కాంగ్రెస్‌‌ నేతలు : జగదీశ్ రెడ్డి

  •     విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి

పెన్ పహాడ్, వెలుగు :  కాంగ్రెస్‌‌ నేతలు పదవుల కోసం ఆంధ్ర పాలకులు నీటిని తీసుకెళ్తున్నా పట్టించుకోకుండా రైతులకు అన్యాయం చేశారని విద్యుత్ శాఖ- మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు.  శనివారం పెన్ పహాడ్ మండలంలోని పలు  గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌‌కు ఓటేస్తే ఆ నాయకులకు పదవులు మాత్రమే వస్తాయని, బీఆర్‌‌‌‌ఎస్‌‌కు ఓటే వేస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని 60 ఏండ్లు  పాలించిన  కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి జిల్లాకు ఒరిగిందేమీ లేదని

నల్గొండ నేతల చేతగాని తనం వల్లే  ఏడేళ్లు సాగర్ ఎడమకాలువ ఎండిపోయిందని మండిపడ్డారు. మూసీ ప్రాజెక్టు శిథిలావస్థకు చేరి నీరు లీకవుతున్నా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చాక ఎడమ కాల్వ ద్వారా వరుసగా 18 పంటలకు నీళ్లు ఇచ్చామని చెప్పారు. తనకుప్రజల ఆస్తులు, భూములు దోచుకుంటున్న వారి శత్రువులన్నారు.  నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.