![పల్లె, పట్టణాల్లో మెరుగైన మౌళిక వసతులు](https://static.v6velugu.com/uploads/2022/04/Minister-Jagadish-Reddy-directed-the-authorities-to-provide-better-infrastructure-in-urban-and-rural-areas_hF86m2nLIP.jpg)
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, నీటి పారుదల కార్యక్రమాల పై మంత్రి జగదీష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.ప్రజల సౌకర్యార్థం పట్టణ,పల్లె ప్రాంతాల్లో మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పట్టణాల్లో పార్కుల నిర్మాణం జరగాలన్నారు. ప్రభుత్వ భూమి ఉన్న చోట ప్రకృతి వనాలు పెంచాలన్నారు. ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో కాళేశ్వరం నీళ్లు వానాకాలం నాటికి అందించాలని ఆదేశించారు.కేంద్రం ప్రకటించిన 10 ఉత్తమ గ్రామాల్లో 9 గ్రామాలు మన రాష్ట్రం నుంచే ఉండటం గర్వకారణంగా ఉందన్నారు. 421 గ్రామ పంచాయితీలు, ఆరు మున్సిపాలిటీల్లోని వైకుంఠ దామాల్లో మౌలిక వసతులు కల్పించామన్నారు.పంట కాల్వల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని..భూ సేకరణ వేగవంతం చేయాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం
స్కూల్స్ పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచాలి
రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి