మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ నేతలు

బీజేపీపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు.  మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప ఆ పార్టీ నేతలకు ప్రజల ఆకలి కేకలు వినపడవని అన్నారు. అనుక్షణం అడుగడుగునా తెలంగాణపై విషం కక్కడమే పనిగా వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం చేయూతనివ్వకపోగా.. స్వశక్తితో ఎదుగుతున్న తెలంగాణను చూసి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. మేకవన్నెపులుల్లాంటి బీజేపీ నేతలు తెలంగాణ ద్రోహులని విమర్శించారు. బీజేపీ సిద్ధాంతాలు ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిరూపమన్న జగదీష్ రెడ్డి కేసీఆర్ ఉన్నంతకాలం రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఆటలు సాగవని హెచ్చరించారు. 

మరిన్ని వార్తల కోసం..

చదువు కోసం నిత్యం పోరాటం

పుష్కర్ ధామి ఘన విజయం.. అభినందనలు తెలిపిన మోడీ