కాంగ్రెస్ను గెలిపిస్తే ..దొంగచేతికి తాళాలిచ్చినట్లే: మంత్రి జగదీష్రెడ్డి

కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణకు చిప్ప తప్ప మరేమీ మిగలదని.. దొంగచేతికి తాళాలిచ్చినట్లేనని మంత్రి  జగదీష్ రెడ్డి అన్నారు. రాష్ట్రా భివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అడిగిన సమస్యలు, అడగని సమస్యల అన్నీ పరిష్కరించిన నేత కేసీఆర్ అని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కనపడని వారు ఇవాళ ఏదో చేస్తామని అబద్ధాలు చెపుతూ ఓట్లకోసం మీముందుకు వస్తున్నారని మంత్రి ఆరోపించారు.

కర్నాటకలో 24 గంటల కరెంట్ పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రకటించిన 5గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని కేవలం 2 గంటలే ఇస్తుందని అన్నారు. తెలంగాణలో ఇచ్చే సంక్షేమ పథకాలు కర్ణాటక ప్రజలు అడిగితే ఇవ్వలేమని చేతులెత్తేశారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు చెపుతారని.. రాష్ట్రాభివృద్దిపై ఎలాంగి అవగాహన లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీతో రైతులకు అండగా ఉందన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ ఎస్ ప్రభుత్వం అన్నారు.  కళ్యాణలక్ష్మీ, ఆసరా ఫించన్లు వంటి అనేక సంక్షేమ పథకాలను ఇస్తున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు 5లక్షల బీమా అందిస్తామని.. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, 400 లకే గ్యాస్ అందిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ ను గెలిపిస్తే తెలంగాణకు చిప్ప తప్ప మరేమి మిగలదని.. అభివృద్ధి, సంక్షేమం కావాలంటే బీఆర్ ఎస్ కు ఓటు వేసి మరోసారి అధికారంలోకి తేవాలని మంత్రి జగదీష్ రెడ్డి కోరారు.

ALSO READ :నర్సాపూర్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డిని మార్చాల్సిందే .. కాంగ్రెస్ అధిష్టానానికి పార్టీ ముఖ్య నేతల హెచ్చరిక