- మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట లోని మహా ప్రస్థానం శనివారం నుంచి అందుబాటులోకి వస్తుందని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో రూ.. 4.20 కోట్ల తో మహాప్రస్థానాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహాప్రస్థానంలో కాటికాపరులతో సమావేశం అయిన మంత్రి, అంత్యక్రియల ఫీజును రూ.6 వేలుగా నిర్ణయించారు.ఈ ఫీజు రాష్ట్రం లోనే అతి తక్కువగా ఉందన్నారు.
పెన్ పహాడ్, వెలుగు : మండలంలోని చీదెళ్ల గ్రామంలో బస్ షెల్టర్, రూ.9.70 కోట్లతో నిర్మించే గౌడాన్ నిర్మాణానికి, పెద్దగట్టుపై కొలువైన లింగమంతుల స్వామి ఆలయ రాజగోపురాల నిర్మాణం కోసం రూ. 50 లక్షలతో చేపట్టే పనులకు గురువారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గత పాలకుల హయాంలో ఏనాడు పెద్దగట్టు ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే కోనేరు, గెస్టు హౌజ్, పూజారుల విశ్రాంతి భవనం, కార్యాలయం, విద్యుదీకరణ పనులు శాశ్వత ప్రతిపాదికన నిర్మించామని తెలిపారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బిక్షం, జడ్పీటీసీ అనిత, సర్పంచ్ సీతారాంరెడ్డి , ప్యాక్స్ చైర్మన్ సీతారామ్ రెడ్డి , ఎంపీటీసీ వెంకట్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.