నల్గొండ జిల్లా: చీమలు, పందికొక్కుల వల్లే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. నిడమనూరు మండలం ముప్పారం గ్రామ సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడిన ప్రాంతాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. కాలువకు గండి పడడం వల్ల ఎలాంటి నష్టం కలగకుండా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టామని చెప్పారు.
రైతులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేస్తామని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి వెంట ఎమ్మెల్యేలు నోముల భగత్, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.