రేవంత్ చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు తెలుసు

రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి  మండిపడ్డారు. కేసీఅర్ జన్మదిన వేడుకలను  రేవంత్ హేళన చేసి మాట్లాడడం దుర్మార్గమన్నారు మంత్రి. బీజేపీ సీఎం .. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే..వాటిని సీఎం కేసీఆర్ ఖండించారన్నారు. అటువంటి సంస్కారం కేసీఆర్‌ది అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. కేసీఆర్ జన్మదిన వేడుకలను తద్దిన వేడుకలుగా జరపాలని చెప్పిన నీచ సంస్కారం రేవంత్‌ది అని విమర్శించారు. అస్సాం సీఎం హేమంత్ బిస్వా కంటే సంస్కార హీనుడు రేవంత్ అంటూ మండిపడ్డారు మంత్రి.  రేవంత్ చరిత్రే౦టో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు.  తెలంగాణ ద్రోహులకు,ఉద్యమంలో కుట్రలు చేసినోళ్లకు మూటలు మోసిన చరిత్ర రేవంత్‌ది అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేందుకే రేవంత్ పార్టీలో చేరాడని సొంత పార్టీ నేతలే చెబుతున్నరన్నారు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ నేత కాదు.. కోవర్ట్ అని విమర్శించారు మంత్రి

ఇవి కూడా చదవండి:

కాంగ్రెస్కు జిరాక్స్ ఆమ్ ఆద్మీ పార్టీ:మోడీ

రాహుల్ నన్ను టెర్రరిస్టు అంటున్నడు